Sadu Malyadri: బహుజన శ్రామిక వర్గ దృక్పథoతో రాజ్యాధికారం కోసం పోరాడాలి.

బహుజన పొలిటికల్ సెంటర్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కోఆర్డినేటర్ సాధు మాల్యాద్రి.

On
Sadu Malyadri: బహుజన శ్రామిక వర్గ దృక్పథoతో రాజ్యాధికారం కోసం పోరాడాలి.

సూర్యాపేట- రాజముద్ర న్యూస్:.మారోజు వీరన్న ఆలోచన విధానంతో దళిత బహుజనులను ఐక్యం చేస్తూ బహుజన శ్రామిక వర్గ దృక్పథంతో రాజ్యాధికారి కోసం పోరాడాలని తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బహుజన పొలిటికల్ సెంటర్ కోఆర్డినేటర్ సాదు మాల్యాద్రి, బహుజన పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ దండి వెంకట్, బిసిపి రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు, గూడూరు సీతామహాలక్ష్మిలు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో బహుజన మహాసభ రాష్ట్ర ప్రథమ మహాసభలను ఉద్దేశించి వారు మాట్లాడారు. ఏ కులానికి ఆ కులాన్ని  కూడగట్టకుండా బహుజన ఐక్యత సాధ్యం కాదని అన్నారు. బీఎస్పీ, ఎస్పీ, ఆర్ జెడి, డీఎంకే లాంటి పార్టీలు విశాలమైన బహుజన పార్టీ లుగా ఎదగక పోవడానికి కారణం కుల సంఘాలను కూడగట్టుకునే అవగాహన లేకపోవడమేనన్నారు.

 

ఈనాడు దేశంలో ఎన్నో దళిత సంఘాలు, బీసీ సంఘాలు ఉన్నప్పటికీ ఐక్యంగా పోరాటాలు చేయకపోవడం విచారించదగ్గ విషయం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఐక్యం చేసి బహుజన మహాసభలో ఐక్యం చేయాలని  అమరుడు మారోజు వీరన్న  సూత్రీకరించాడని తెలిపారు. దేశంలో పెచ్చరిల్లుతున్న హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా దళిత బహుజనులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎర్ర జాన్సన్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా బత్తుల వెంకన్న, కార్యదర్శిగా బుడిగే మలేష్ యాదవ్ లను ఎన్నుకున్నారు. ఈ మహాసభలో కంబాలపల్లి శ్రీనివాస్, కొత్తగట్టు మల్లయ్య, తోకల సంజీవ్, మాండ్ర మల్లయ్య యాదవ్, నారబోయిన వెంకట్ యాదవ్, గాలి వెంకన్న, అమ్రు నాయక్, వడ్డే ఎల్లయ్య, తండు శ్రీనివాస్ యాదవ్, బొడ్డు శంకర్, చామకూరి నరసయ్య, నవీలే ఉపేందర్, లింగంపల్లి విజయ్ తదితరులు ప్రసంగించారు.

Views: 33
Tags:

About The Author

Related Posts

Latest News