Pro Kabaddi : 19 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 తెలుగు టైటాన్స్ హోమ్ మ్యాచ్‌ల‌కు ఆతిథ్యం

On
Pro Kabaddi : 19 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 తెలుగు టైటాన్స్ హోమ్ మ్యాచ్‌ల‌కు ఆతిథ్యం

Pro Kabaddi : ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ హోమ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ సిద్ధమైంది. సీజన్ 9లో ముందుగా అక్కడ ఆడిన , తెలుగు టైటాన్స్ తమ సీజన్ X హోమ్ మ్యాచ్‌లను 2024 జనవరి 19 నుండి 24 వరకు హైదరాబాద్‌లో ఆడనుంది. సీజన్ X హోమ్ మ్యాచ్‌లను గురించి తెలుగు టైటాన్స్ సీఈఓ, త్రినాథ్‌ రెడ్డి మాట్లాడుతూ: “ఈ లీగ్ పోటీ నాణ్యత, గేమ్‌ప్లే, ఆటగాళ్ల ప్రదర్శనల పరంగా మహోన్నత స్థాయికి పెరిగింది. ప్రో కబడ్డీ లీగ్ యొక్క ప్రస్తుత సీజన్, చాలా గట్టి పోటీతో కూడిన కొన్ని మ్యాచ్‌లకు సాక్షిగా నిలిచింది. తెలుగు టైటాన్స్‌లో కెప్టెన్ పవన్ సెహ్రావత్ మరియు సందీప్ ధుల్, పర్వేష్ వంటి దిగ్గజాలు తమ ఆటను పునర్నిర్వచించుకోవడం తో పాటుగా కొత్త ఆటగాళ్లు కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారని అని అన్నారు. తెలుగు టైటాన్స్ తమ మొదటి హోమ్ లెగ్ మ్యాచ్‌ను జనవరి 19 న బెంగళూరు బుల్స్‌తో ఆడుతుంది. అభిమానులు ప్రతి మ్యాచ్‌ని లైవ్‌లో, రాత్రి 7:30 గంటలకు FTA ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 2 & స్టార్‌ స్పోర్ట్స్ 2 HD – ఇంగ్లీష్, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, కన్నడలో స్టార్ సువర్ణ ప్లస్‌లో, తెలుగులో స్టార్ మా గోల్డ్ మరియు హాట్‌స్టార్ తో సహా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు.

Views: 5
Tags:

About The Author

Related Posts

Latest News