చేనేత పరిశ్రమలను కాపాడుకుందాం
మాజీ ఉపసర్పంచ్ బండారి రవీందర్
On

చేనేతన్నలకు చేయూతనిద్దాం - దుస్తులను ధరిద్దాం
మేడిపల్లి - రాజముద్ర న్యూస్: రాష్ట్రంలో చేనేత పరిశ్రమను కాపాడుకుంటూ చేనేత అన్నలకు చేయూతనిస్తూ వారు నేసిన దుస్తులను ధరించుదామని మేడిపల్లి మాజీ ఉపసర్పంచ్ బండారి రవీందర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నల్లగొండ జిల్లా రామన్నపేటలో గల చేనేత మగ్గాలను, చేనేత పరిశ్రమలను పరిశీలించారు.
చేనేతన్నలు బట్టలు తయారు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండారి రవీందర్ మాట్లాడుతూ... మాజీ మంత్రి కేటీఆర్ గతంలో చేనేత పరిశ్రమను కాపాడుకుందామని, వారంలో ఒకరోజు చేనేతనలో నేసిన దుస్తులను ధరించి వారికి చేయూతనిచ్చి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే చేనేత పరిశ్రమలను పరిశీలిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారి రవీందర్, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Views: 6
Tags:
About The Author
Related Posts
Latest News
27 Mar 2025 17:48:14
సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖి