Mobile Phone Thefts: మీ ఫోన్ పోయిందా... అయితే ఇలా చేయండి
• ఇంట్లో కూర్చుని కంప్లైంట్ చేయవచ్చు
On

Rajamudra News: మీ మొబైల్ ఫోను ఎక్కడైనా పోగొట్టుకున్నారా..? లేదా చోరీకి గురైందా..? అయితే నో ప్రాబ్లం ఈజీగా మీ ఫోన్ దొరుకుతుంది. ఇందుకోసం ప్రభుత్వాలు ఫోను ను రికవరీ చేసుకునేందుకు అనేక మార్గాలు ప్రవేశపెట్టారు. అందులో సులువైన మార్గం ఇదే..
నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో కూడా ప్రజలు మొబైల్ ఫోనుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఏ పని జరగాలన్న చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే ఆ ఫోన్ గనక ఒకవేళ పోతే మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే కంప్లైంట్ చేయవచ్చును. వేరే మొబైల్ ఫోన్ నుండి వాట్సప్ లో 9440627057 నెంబర్ కు Hi అని మెసేజ్ చేస్తే గూగుల్ లింక్ వస్తుంది ఆ గూగుల్ లింకు ను ఓపెన్ చేసి మీ మొబైల్ యొక్క IMEI నంబర్ తదితర వివరాలు ఎంటర్ చేయాలి. ఇలా చేయడం వలన నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ వెళ్తుంది. పోలీసులు వెంటనే నిఘా ఉంచి ఫోను ఎక్కడ ఉందో ఇట్టే పసిగడతారు. వెంటనే ఫోన్ ఉన్న ప్రదేశానికి వెళ్లి స్వాధీనం చేసుకుంటారు. ఒక రకంగా ఇది ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశమే.
Views: 70
Tags:
About The Author
Related Posts
Latest News
27 Mar 2025 17:48:14
సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖి