Breaking: విద్యార్థులకు నెలకు రూ. 12,400/- పొందాలంటే ఇలా చేయండి

AICTE PG స్క్రీమ్ - 2024 కేంద్ర ప్రభుత్వం మంజూరు

On
Breaking: విద్యార్థులకు నెలకు రూ. 12,400/- పొందాలంటే ఇలా చేయండి

Scholarship: విద్యార్థులకు సరిపడా డబ్బు ఉన్నట్లయితేనే వాళ్లు చదువులో ఇంకా బాగా రాణించగలుగుతారు. అయితే కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు పలు రకాల పథకాలు అమలులోకి తెచ్చింది. అయితే నూతనంగా ప్రతి నెల స్టైఫెండ్ లాగా ఇచ్చేందుకు నూతన పథకాన్ని అమలులోకి తెచ్చింది. అయితే మాస్టర్స్ డిగ్రీ (PG) చేస్తున్న వారికోసం ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది.
 
అయితే దీనిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా పొందాలి అనేది చూసుకొని తప్పులు లేకుండా పూరించుకోవాలి. 
https://pgscholarship.aicte-india.org/ అనే వెబ్సైట్లో పూర్తి సమాచారాన్ని అందించాలి. దీనికి ఆఖరి తేదీ జూన్ 30, 2024 గా రూపొందించారు. అయితే ఈ స్కాలర్షిప్ పొందాలనుకునేవారు తప్పనిసరిగా GMAT లేదా GPAT పరీక్ష రాసి దానిలో క్వాలిఫై కావాలి. తరువాత అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి.
 
 
మనము ఎక్కడైతే చదువుతున్నామో ఆ సంస్థ.. మనం పొందిన స్కోరు వీటినన్నిటిని ఒక ఫైల్ రూపంలో తయారు చేసుకోవాలి. వెరిఫికేషన్ అంతా సంస్థనే చూసుకుంటుంది మనల్ని అర్హులని చేయాలా వద్దా అనేది పూర్తిగా సంస్థ నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది. వారిదే తుది నిర్ణయాధికారం. ఆ సంస్థ మీ అప్లికేషన్ ని ఆమోదించాక PFMS పోర్టల్ కు పంపుతుంది ఆ తరువాత అది మన బ్యాంకులో నెల నెల 12,400 డబ్బులను వేస్తుంది. ఒకసారి బ్యాంక్ ఎకౌంటు ఇచ్చిన తర్వాత మార్చకూడదు. పార్ట్ టైం చదివేవారు ఏదైనా స్కాలర్షిప్స్ స్టైఫెండ్ పొందేవారు ఈ పథకానికి అనహర్వులు. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క  స్టైఫెండ్ ను రెండు సంవత్సరాల వరకు ఇస్తుంది. ఒకవేళ కోర్సు ముందు అయిపోయిన అప్పటివరకు ఇస్తుంది.పూర్తి వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్ 01129 581000, 01129581333 లకు కాల్ చెయ్యవచ్చు.
Views: 48
Tags:

About The Author

Related Posts

Latest News