Bheemadevarapally, Mulkanoor: బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలి

మాజీ జడ్పీ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలి
మాజీ జడ్పీ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి ( Bheemadevarapally) మండలం ముల్కనూరు గ్రామంలో బీఆర్ఎస్(BRS) మండల అధ్యక్షులు మండల సురేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం వెంకట సాయి గార్డెన్లో జరిగింది. ఈ సందర్బంగా జడ్పీ చైర్మన్(ZP Chairmnan) సుధీర్ కుమార్ మాట్లాడుతూ...
ఎన్నో అవమానాలు, అవహేళనలు
అన్నిటినీ అధిగమించి స్వరాష్ట్రాన్ని సాధించి 4 కోట్ల తెలంగాణ ప్రజల కళను సాకారం చేసి సగర్వంగా నిలిపిన జెండా "గులాబీ జెండా" అని అన్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తి (Elkathurthi) లో జరిగే మన ఇంటి పార్టీ పండుగ రజతోత్సవ సభకు( Silver jubli) స్వచ్ఛందంగా తరలి విజయవంతం చేద్దాం అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మండల సురేందర్, మాజీ ఎంపీపీ జక్కుల అనిత రమేష్ యాదవ్, మాజీ జెడ్పిటిసి వంగ రవీందర్, మాజీ ఎంపీపీ సంగ సంపత్ యాదవ్, మాజీ కోఆప్షన్ సభ్యులు షరీఫొద్దీన్, సల్పాల తిరుపతి, శనిగరపు సదానందం, అప్పని బిక్షపతి, మర్రి మల్లేష్,గుడి కందుల పూర్ణచందర్, రాజు, కండే సుధాకర్, ఎర్రోజు వినయ్, తాళ్లపల్లి కుమార్, అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు