Bheemdevara Pally: యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
• యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి - పెద్ది వెంకట్ నారాయణ గౌడ్
Bhima Devarapalli: భీమదేవరపల్లి మండలం ములుకనూర్ గ్రామం లోని హై స్కూల్ గ్రౌండ్ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా వైస్ చైర్మన్, వసంత చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెద్ది వెంకటనారాయణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై టాస్ వేసి మొదటి మ్యాచ్ ను ప్రారంభించారు. వీరితోపాటు కొత్తకొండ దేవస్థానం చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కుల అనిల్, ఊసకోయిల ప్రకాష్, గజ్జల రమేష్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పెద్ది వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ. గ్రామాల్లోని యువతలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. యువత విద్యతోపాటు క్రీడా రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.