ధరణి పెండింగ్ సమస్యలపై కీలక నిర్ణయం: సీఎం రేవంత్ రెడ్డి
అన్ని మండల జిల్లా కేంద్రాలలో పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశం
On

Telangana: తెలంగాణలో గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ప్రవేట్ ఏజెన్సీకి అప్పజెప్పి రైతుల భూముల లెక్కలను తారుమారు చేసే విధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందని, తక్షణమే దాని స్థానంలో భూమాత పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. ధరణిలో ఎన్నో రకాల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలలో పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేసి భూ పంచాయతీలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ధరణి కమిటీ అధికారుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.45 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ధరణి కమిటీ తుది నివేదిక తర్వాత భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలిపారు.
Views: 16
Tags:
About The Author
Related Posts
Latest News
21 Mar 2025 20:22:33
తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు బీబీనగర్, రాజముద్ర న్యూస్: బీబీనగర్(Beebinagar) తహశీల్దార్ ను సస్పెండ్ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ మేరకు ఉత్తర్వులు...