Arrest: BRS ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్...

• అక్రమ మైనింగ్ కు పాల్పడ్డాడని తహసిల్దార్ ఫిర్యాదుతో అరెస్టు చేసిన పోలీసులు

On
Arrest: BRS ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్...

హైదరాబాద్, రాజముద్ర న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి రోజుకొక దెబ్బ తగులుతుంది. తాజాగా పటాన్ చెరువు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలో, పఠాన్‌ చెరువు నియోజక వర్గం, లక్డారం గ్రామ శివారులో సర్వే నెంబర్‌ 738 ప్రభుత్వ భూమిలో అడ్డగోలుగా మైనింగ్‌ తవ్వకాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా కన్నం పెడుతున్నారు .. ఎలాంటి ఎన్ఓసి లు లేకుండా విచ్చలవిడిగా మైనింగ్‌ తవ్వకాలు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న గూడెం మహిపాల్‌ రెడ్డి తమ్ముడు మధుసుధన్‌ రెడ్డి, నాలుగెకరాల అనుమతితో.. పది హేను ఎకరాల మైనింగ్‌ అక్రమంగా తవ్వి 100 కోట్లు కొల్లగొట్టిన అక్రమార్కుడు.. వాల్టా చట్టానికి, నిబంధనలకు తూట్లు పొడుస్తూ లకడారం చెరువును కలుషితం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హానికరం చేస్తున్న మధుసూదన్ రెడ్డి ఆగడాలు అన్ని ఇన్ని కావు. స్థానిక లక్డారం గ్రామంలో  పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని మధుసూదన్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పటాన్చెరు తహసిల్దార్ ఫిర్యాదుతో అరెస్టు చేశామని స్థానిక పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారని పేర్కొన్నారు.

 
తహసిల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు:
 
పటాన్‌ చెరువు తహశీల్దార్‌ సి.భాస్కర్‌ లక్డారం గ్రామ శివారు సర్వే నెంబర్‌ 738 ప్రభుత్వ భూమిలో చేస్తున్న అక్రమ మైనింగ్‌ పైన తేది :- 27-01-2024 రోజున స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో పిర్యాదు చేశారు..తహశీల్దార్‌ పిర్యాదు మేరకు పోలీస్‌ అధికారులు సంతోష్‌ సాండ్‌ అండ్‌ గ్రానైట్‌ సప్లై కంపెనీ యజమాని గూడెం మధుసూదన్‌ రెడ్డి పై కేసు నమోదు చేశారు..ఎఫ్‌. ఐ.అర్‌ నెంబర్‌ 97/2024 కలదు..ప్రస్తుతం మధుసూదన్‌ రెడ్డి అన్న గూడెం మహిపాల్‌ రెడ్డి పటాన్‌ చెరువు ఎమ్మెల్యే గా ఉండడం తో చర్యలు తీసుకుంటారా..?లేదా..? అన్నది వేచి చూడాల్సి ఉన్నది.
Views: 330
Tags:

About The Author

Latest News