Digital Health Profile Cards: వీటికి రేషన్ కార్డు అవసరం లేదు... అందరూ అర్హులే...: సీఎం రేవంత్ రెడ్డి
• జులై నుండి ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం
On

Digital Health profile Cards: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు పంపిణీకి సంబంధించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. జులై నుంచి హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులకు రేషన్ కార్డు అవసరం లేదని తెలంగాణ ప్రజలందరూ అర్హులేనని పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రొఫైల్ రూపొందిస్తున్నామని.. ఇకపై ఏ వైద్యుడిని సంప్రదించినా సరే ప్రజల ఆరోగ్య పరిస్థితుల్ని తెలుసుకునే విధంగా ఉంటుందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుకు సత్కార సభ జరిగింది.
ఆధార్ కార్డు సంఖ్య తరహాలో ఒక్కో పౌరుడికీ స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యతో గుర్తింపు కల్పిస్తామన్నారు. పేరు టైప్ చేస్తే సమగ్ర వైద్య సేవల వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ఏ వైద్యుడిని సంప్రదించినా వారి ఆరోగ్య స్థితిగతులను వెంటనే తెలుసుకుని మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రజలు గర్వించేలా పనిచేస్తామన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేల క్వార్టర్లలోని డిస్పెన్సరీలతోపాటు అన్ని ఆసుపత్రుల్లో చికిత్సకు అనుగుణంగా మందుల్ని సరఫరా చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యేలు రాజేశంగౌడ్, ఆంజనేయులు, సత్యనారాయణగౌడ్ తదితరులు మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి మందుల సరఫరాలో కొరతను తీర్చాలని వివరించారు. మందుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి శ్రీపాదరావు మరణానంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనను పార్టీలోకి ఆహ్వానించారని.. తన తల్లి జయశ్రీ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు శ్రీధర్ రెడ్డి. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సేవలందించాలంటే చాలా సహనం ఉండాలన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో తనకు గన్ మెన్లు తొలగించినా.. భయపెట్టే ప్రయత్నం చేసినా.. వెనకడుగు వేయలేదని, హంగూ ఆర్భాటాలకు పోకుండా సాధారణ వ్యక్తిగానే పనిచేశానన్నారు. మంథని ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానన్నారు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Views: 74
About The Author
Related Posts
Latest News
27 Mar 2025 17:48:14
సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖి