Mayor Jakka Venkat Reddy: ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వాలు పనిచేయాలి

• పీర్జాదిగూడ నగర మేయర్ జక్కా వెంకట్ రెడ్డి

On
Mayor Jakka Venkat Reddy: ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వాలు పనిచేయాలి

చోటే మియా... బడే మియా... డౌన్ డౌన్ అంటూ నినాదాలు

IMG-20240316-WA1016

• అక్రమ అరెస్టును ఖండించిన మేయర్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు

Also Read:  Bheemadevarapally: తహసిల్దార్ కు ఫిర్యాదు చేసిన కొప్పురు గ్రామస్తులు 

ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
 రాజముద్ర, వెబ్ డెస్క్: ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల హక్కులను కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని పీర్జాదిగూడ నగర మేయర్ జక్కా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు శనివారం పీర్జాదిగూడ నగర పరిధిలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చోటే మియా... బడే మియా.. డౌన్ డౌన్ అంటూ బిఆర్ఎస్ శ్రేణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Also Read:  Bheemadevarapally, Mutharam: ముత్తారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

 

Also Read:  Telangana, Rajiv Yuva Vikas: రాజీవ్ యువ వికాస్ పథకంలో నిరుద్యోగ యువతకు చిక్కులు

      ఈ సందర్భంగా మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సామాన్య ప్రజలు సైతం విసుగు చెందేలా ఉన్నాయన్నారు. కవిత వేసిన పిటిషన్ కేసు సుప్రీంకోర్టులో ఈనెల 19వ తారీఖు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఈ  దుందుడుకు చర్యకు పాల్పడడం హేయమన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి, తనే దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని అహంకారపూరితంగా అక్రమ అరెస్టులను చేయించడం, తప్పుడు కేసులు బనాయించడం విడ్డూరంగా ఉందన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కొనసాగుతుందని, పలుమార్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఢిల్లీకి పిలిచి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ కవిత కూడా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే శనివారం పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో శుక్రవారం హడావుడి చేయడం, ముందుగానే ఫ్లైట్ టికెట్ బుక్ చేయటం అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అన్నారు.  

 

         తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ బిజెపి పార్టీ చీకటి ఒప్పందం చేసుకొని ఉద్యమ పార్టీ అయినా బి ఆర్ ఎస్ ను దెబ్బ తీయాలన్నా ఆలోచనలతో ఈ చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీకి అక్రమ అరెస్టులు అక్రమ కేసులు, ఉద్యమాలు, ధర్నాలు కొత్తేమి కావని, వీటన్నింటి నుండే పార్టీ పుట్టిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించుకోవాలని పేర్కొన్నారు. మీ చీకటి ఒప్పందాన్ని రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో బట్టబయలు చేసి ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే చీకటి ఒప్పందంతో టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాకుండా నరేంద్ర మోడీ కుయుక్తులు  పన్నారని తెలిపారు. మళ్లీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కెసిఆర్ కేంద్రంలో చక్రం తిప్పుతారన్న  భయంతోనే చోటే మియా... బడే మియా... ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని అన్నారు. పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ... అక్రమ అరెస్టులను ఖండిస్తూ... ఇలాంటి చర్యలను సహించేది లేదని, ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా వస్తారని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌడే పోచయ్య, కొల్తూరి మహేష్, సుభాష్ నాయక్, మధుసూదన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, అనంతరెడ్డి, హరి శంకర్ రెడ్డి, నాయకులు బండారి రవీందర్, రఘు వర్ధన్ రెడ్డి, రఘుపతి రెడ్డి, మనోరంజన్ రెడ్డి, మధు, ప్రశాంత్, జావిద్ ఖాన్, పీర్జాదిగూడ టిఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు నిర్మల, చందన, పలువురు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Views: 47
Tags:

About The Author

Latest News